గోపీచంద్ సరసన తమన్నా

01 Feb,2019

హీరో గోపీచంద్ ప్రస్తుతం తిరు దర్శకత్వంలో తన 26వ చిత్రంలో నటిస్తున్నాడు.  చిత్రం  మొదటి షెడ్యూల్ రాజస్థాన్ లోని జై సల్మేర్ లో జరుగనుంది. 45 రోజులపాటు జరుగనునున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.  ఈ చిత్రంలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా ను తీసుకోవాలనుకుంటున్నారట. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపేందుకు రెడీ అవుతున్నారు. ఈ మధ్య వరుస పరాజయాలతో డీలా పడిన మిల్కి బ్యూటీ తాజాగా ఎఫ్ 2తో మంచి విజయాన్ని అందుకుని మళ్ళి ఫామ్ లోకి వచ్చేసింది. సో తమన్నా కూడా గోపీచంద్ తో నటించే ఆసక్తి కనబరుస్తున్నట్టు టాక్.  ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈచిత్రానికి టైటిల్ ఏమిటా అన్న ఆసక్తి నెలకొంది.  

Recent News